డొనాల్డ్ ట్రంప్‍కు మోదీ ఘన స్వాగతం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రథమ మహిళా మెలానియా ట్రంప్ అహ్మదాబాద్ ఎయిర్‍పోర్టుకు చేరుకున్నారు. వారికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ప్రధాని వెంట ఉన్నారు. ట్రంప్‍తో పాటు ఆయన కూతురు, అధ్యక్షుడి సీనియర్ సలహాదారు ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్, అమెరికాకు చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బృందం కూడా భారత్‍కు విచ్చేసింది. ఎయిర్‍పోర్టు సర్కిళ్లలో ఏర్పాటు చేసిన కళాకారుల ప్రదర్శన బృందాలు ట్రంప్‍నకు స్వాగతం పలికాయి. ఆయన పర్యటన సందర్భంగా 13 రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎయిర్‍పోర్టు నుంచి మోతేరా స్టేడియం వరకు 22 కిలోమీటర్ల మేర సాగే రోడ్‍షోలో ఇరు దేశాధినేతలు పాల్గొన్నారు.
Tags :