అమెరికా ఎన్నారైలను ఆకర్షించిన ప్రధాని మోదీ
అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి ఎన్నారైలతో ముచ్చటిస్తూ, ప్రపంచవ్యాప్తంగా భారత సంతతికి చెందిన వారు ప్రత్యేకంగా కనిపిస్తారని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్నారైలే మన దేశ బలమని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. వారితో సమావేశమైన ఫొటోలు షేర్ చేశారు.ప్రధాని మోదీ ఏ దేశం వెళ్లినా ప్రవాస భారతీయులతో కచ్చితంగా సమావేశమవుతారు. ఈసారి కోవిడ్-19 కారణంగా పెద్ద పెద్ద సమావేశాలేవీ పెట్టుకోలేదు. అమెరికాలోని ఎన్నారైల్లో ప్రధానికి మంచి ఆదరణ ఉంది. దీంతో ఆయన అమెరికా పర్యటనకు ప్రవాస భారతీయుల నుంచి పెద్దఎత్తున మంచి స్పందన వస్తోంది.
Tags :