అమెరికాలో మోదీకి ఘన స్వాగతం
అమెరికా పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడి భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. హ్యూస్టన్ నగరంలోని జార్జిబుష్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఆయనకు అధికారులతోపాటు ఎన్నారైలు ఘనంగా స్వాగతం పలికారు.
'హౌడీ మోదీ' కార్యక్రమానికి ముందుగా సిక్కులు, కశ్మీర్ పండిట్‌లు, వోహ్రా సమాజానికి చెందినవారు ప్రధాని మోదీని కలుసుకున్నారు. సిక్కువర్గంవారు కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుచేయడాన్ని గుర్తుచేస్తూ మోడీని అభినందించారు. అలాగే కతార్‌పూర్ కారిడార్ ఏర్పాటుపై కతజ్ఞతలు తెలిపారు. సిక్కువర్గంవారు మోదీని కలుసుకుని ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. దానిలో 1984 సిక్కుల ఊచకోత, భారతీయ రాజ్యాంగంలోని సెక్షన్ 25, ఆనంద్ మ్యారేజ్ యాక్ట్, వీసా, పాస్‌పోర్ట్ తదితర అంశాలను ప్రస్తావించారు. కాలిఫోర్నియాలో ఉంటున్న కశ్మీరీ పండిట్ అరవింద్ చావ్లా మాట్లాడుతూ తాము ప్రధాని నరేంద్ర మోదీకి ఒక వినతి పత్రం సమర్పించామని తెలిపారు. కాగా పీఎం నరేంద్ర మోదీ అమెరికాలో ఉంటున్న కశ్మీరీ పండిట్ల సంఘాన్ని కలుసుకున్నారు.