అమరావతిలో ప్రధాని మోడీ షెడ్యూల్
అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. శంకుస్ధాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. ప్రధాని అమరావతి షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుల చేసింది.
మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రధాని శంకుస్థాపన ప్రాంతానికి చేరుకుంటారు.
12:30 - 12:35 వరకు అమరావతి గ్యాలరీని సందర్శిస్తారు.
12:35 - 1243 మధ్య శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.
12:43 - 12:45 మధ్య ప్రధానికి, అతిధులకు పుష్పగుచ్చాలు అందజేస్తారు.
12:45 - 12:50 వరకు మా తెలుగుతల్లికి గీతాలాపన
12:50 - 12:53 వరకు జపాన్ మంత్రి యేసుకే తకాగి ప్రసంగిస్తారు.
12:53 - 12:56 వరకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రసంగం.
12:56 - 1:01 వరకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగం
1:01 - 1:11 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు.
1:11 - 1:43 ప్రధానమంత్రి నరేంద్రమ మోడీ ప్రసంగిస్తారు.
1:43 - 1:46 వరకు ప్రధాని, అతిథులకు జ్ఞాపికలు బహుకరణ.
అమరావతి శంకుస్తాపనలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఇలా కొనసాగుతుంది.