ASBL Koncept Ambience

మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

హౌడీ మై ఫ్రెండ్స్‌! టెక్సాస్‌ అంటే విశాలత్వం.. ఆ విశాలత్వం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ మీరు 50 వేలకు పైగా ఉన్నారు. ఇది కేవలం సంఖ్య కాదు. ఇదో చరిత్ర. కొత్త చరిత్ర. ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో నెలకొన్న ఎనర్జీ. భారత్‌, అమెరికాల మధ్య పెరుగుతున్న మైత్రికి, సమన్వయానికి నిదర్శనం. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రావడం మనకెంతో గర్వకారణం. ఆయన రాక భారతీయ అమెరికన్ల సామర్థ్యానికి ప్రశంస. ఈ కార్యక్రమం పేరు 'హౌడీ మోదీ' అని పెట్టారు. హౌ డు యు డూ మోదీ? అని. మోదీ ఒంటరిగా ఒక శూన్యం.. ఒక సామాన్య వ్యక్తి.. 130 కోట్ల భారతీయుల ఆదేశాలు పాటిస్తున్న సాధారణ వ్యక్తి. అయినా మీరు హౌడీ మోదీ అంటుంటే నాకొకటే అనిపిస్తోంది. నా జవాబు ఒకటే.. భారత్‌లో అంతా బావుంది. భారత్‌ మే సబ్‌ అచ్చాహై అంటూ తెలుగులో అంతా బావుంది సహా వివిధ భారతీయ భాషల్లో ఆ పదాన్ని మోదీ పలికారు. దాంతో స్టేడియంలో మోదీ నినాదాలు మిన్నంటాయి.

ముఖ్యంగా 70 ఏళ్ల సమస్యకు ఫేర్‌వెల్‌ పలికాం.. జమ్మూకశ్మీర్‌ ప్రజలకు అభివద్ధిని దూరం చేస్తున్న ఆర్టికల్‌ 370కి వీడ్కోలు పలికాం. అక్కడి ప్రజలను అభివద్ధిలో భాగస్వామ్యులను చేశాం. 370 రద్దుపై  పార్లమెంటులో పెద్ద చర్చే జరిగింది. ఉభయసభల్లోనూ మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆ బిల్లు విజయం సాధించింది. ఇందుకు మన పార్లమెంటేరియన్లకు మనం నిల్చుని హర్షధ్వానాలతో కతజ్ఞతలు తెలుపుదాం.(స్టేడియంలో స్టాండింగ్‌ ఒవేషన్‌). ఇది కొన్ని ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలవారికి(పరోక్షంగా పాక్‌ను ఉద్దేశించి) నచ్చట్లేదు. ఇప్పుడు సమయమొచ్చింది. ఉగ్రవాదంపై, దానికి మద్దతిచ్చే వారిపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం వచ్చింది. ఈ యుద్ధానికి ట్రంప్‌ నేత త్వం వహించాలని కోరారు.

మేం అధికారంలోకి వచ్చిన తరువాత గత 60 ఏళ్లలో సాధించలేనివెన్నో సాధించాం. న్యూఇండియా లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. డేటా భారత్‌లోనే అత్యంత చవక. డిజిటల్‌ ఇండియాగా భారత్‌ను తీసుకువెళ్తున్నాం. 2, 3 రోజుల్లో ట్రంప్‌తో చర్చలు జరపనున్నాం. భారత్‌, అమెరికాలకు ప్రయోజనం చేకూర్చే మరిన్ని అంశాలపై చర్చించనున్నాం. ఆయన చర్చలు జరపడంలో సిద్ధహస్తుడు. ఆయన నుంచి నేను కూడా నేర్చుకుంటున్నా. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు 21వ శతాబ్దంలో అభివద్ధి పథంలో సాగేందుకు భారత్‌, అమెరికాలు కలసి సాగాల్సి ఉంది. చివరగా థాంక్యూ హ్యూస్టన్‌.. థాంక్యూ అమెరికా.. గాడ్‌ బ్లెస్‌ యూ ఆల్‌..  

Tags :