ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న అమెరికాకు వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న క్యాడ్ సదస్సులో ఆయన పాల్గొంటార. దాంతో పాటు ఐక్యరాజ్యసమతి సర్వసభ దేశాల అత్యున్నత సమావేశంలోనూ పాల్గొంటారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రధాని పర్యటనకు సంబంధించి వివరాలను వెల్లడిరచింది. క్వాడ్ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షత వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిదే సూగాలూ సమావేశాలకు హాజరవుతారు.
సదస్సులో భాగంగా క్యాడ్ వ్యాక్సిన్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. దాంతో పాటు ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న సమస్యలు, వర్తమాన సాంకేతిక పరిజ్ఞానాలు, అనుసంధానత, మౌలిక వసతులు, సైబర్ సెక్యూరిటీ, తీర ప్రాంత రక్షణ, విపత్తు ఉపశమన సాయం, పర్యావరణ మార్పులు, విద్య వంటి వాటిపైనా చర్చిస్తారని పేర్కొంది. నాలుగు దేశాల మధ్య సంబంధాల బలోపేతం, కొవిడ్ పై పోరులో పరస్పర సహకారం వంటి విషయాలతో పాటు ఇండో పసిఫిక్ రీజియన్ లో స్వేచ్ఛ, ఆ ప్రాంతాన్ని ఓపెన్‌గా ఉంచడం వంటి విషయాలపైనా చర్చిస్తారని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడిరచాయి. కాగా ఈ నెల 25న న్యూయార్క్ లో జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 76వ సెషన్ సమావేశాల్లో అత్యున్నత స్థాయీ చర్చలో మోదీ ప్రసంగించనున్నారు.
ప్రస్తుతం ఐరాసలో 193 దేశాలకు సభ్యత్వం ఉన్నది. యూఎన్‌జీలో సంప్రదాయికంగా బ్రెజిల్ తర్వాత అమెరికా అధ్యక్షుడి ప్రసంగం ఉంటుంది. ఈ నెల 21 నుంచి 27 వరకు సమావేశాలు జరగనున్నాయి. 21న బైడెన్ ప్రసంగిస్తారు. ఐరాసలో అఫ్ఘానిస్థాన్ రాయబారి గులామ్ ఐజాక్‌జాయ్ ప్రసంగం చివరన ఉండనున్నది. గులామ్‌ను రాయబారిగా గత ప్రభుత్వం నియమించింది. తాలిబన్ల మధ్యంతర ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ నియామకాన్ని సవాల్ చేయలేదు.