ASBL Koncept Ambience

నేడు సమతామూర్తి విగ్రహావిష్కరణ

నేడు సమతామూర్తి విగ్రహావిష్కరణ

భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు ఆసన్నమయ్యాయి. హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల్లో కీలకఘట్టానికి రంగం సిద్దమైంది. సమతా మూర్తి రామానుజుల 216 అడుగుల భారీ విగ్రహాన్ని నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించేందుకు సర్వం సిద్ధమైంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో శ్రీరామ నగర పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి పరిశీలించారు. హెలీప్యాడ్‌, సమతామూర్తి ప్రాంగణం, యాగశాలల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాగశాల చుట్టూ మెటల్‌ డిటెక్టర్లను అమర్చారు. ముచ్చింతల్‌ శ్రీరామనగరం పూర్తిగా పోలీసుల పహారాలో ఉంది.

 

Tags :