ASBL Koncept Ambience

ప్రధాని మోదీ అమెరికా పర్యటన వివరాలు

ప్రధాని మోదీ అమెరికా పర్యటన వివరాలు

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 27 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఆయన రెండు సార్లు భేటీ కానున్నారు. మోదీ కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి.

సెప్టెంబర్‌ 23: ఐరాస నిర్వహిస్తున్న వాతావరణ సదస్పులో ప్రసంగిస్తారు.

సెప్టెంబర్‌ 24 : భారత్‌- అమెరికా వాణిజ్య సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చించనున్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. గాంధీ సోలార్‌ పార్కును ప్రారంభిస్తారు. భారత్‌ పసిఫిక్‌ ద్వీప దేశాల అధినేతలతో సమావేశం అవుతారు.

సెప్టెంబర్‌ 25: భారత్‌లో పెట్టుబడుల కోసం 40 ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతారు. బ్లూమ్‌బర్గ్‌ బిజినెస్‌ ఫోరమ్‌లో పాల్గొంటారు.

సెప్టెంబర్‌ 26 : వివిధ దేశాలతో ద్వైపాక్షిక అంశాలకు సంబంధించిన చర్చల్లో పాల్గొంటారు.

సెప్టెంబర్‌ 27: ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తారు.

 

 

Tags :