ట్రంప్ ఆగ్రా పర్యటన.. మోదీ వెళ్లరు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రా సందర్శిస్తారని మీడియాలో వస్తున్న వార్తల్ని కేంద్ర ప్రభుత్వం కొట్టివేసింది. ప్రధాని నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్‍తో కలిసి ఆగ్రా సందర్శనకు వెళ్లబోవడంలేదని ప్రభుత్వం సృష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మొదటి మహిళ మెలానియా ఆగ్రా సందర్శనలో భారత్ తరపున ఓ ఒక్క అధికారిక ప్రతినిధి కూడా భాగం కావటం లేదని అధికార వర్గాల సమాచారం. ప్రధాని మోదీ, ట్రంప్‍తో కలిసి ఈ నెల 24న అహ్మదాబాద్‍లో పర్యటిస్తారని, అనంతరం 25 ఢిల్లీలో జరగనున్న అధికారిక కార్యక్రమల్లో మాత్రమే పాల్గొంటారని తెలుస్తోంది. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్‍లో పర్యటించనున్న విషయం తెలిసిందే.
Tags :