శ్రీరామనగరంలో పోలీస్ కంట్రోల్ రూమ్
హైదరాబాద్‌లోని ముచ్చింతల్‌లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్‌ను శాశ్వతంగా ముచ్చింతల్ శ్రీరామనగరంలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ స్పష్టంచేశారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో శుక్రవారం డీజీపీ మహేందర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్‌లతో కలిసి ఆయన పర్యటించారు. శ్రీరామనగరంలో భక్తుల సౌకర్యార్థం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కార్యాలయాన్ని ఇకపై శాశ్వతంగా శంషాబాద్ డివిజన్‌లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శంషాబాద్‌లో పోలీస్ కంట్రోల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించామని ఈ నేపథ్యంలో ఈ ఆశ్రమంలో శాశ్వతంగా ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని భావించి శాశ్వతంగా ఏర్పాటు చేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నామని సీఎస్ స్పష్టంచేశారు.