ASBL Koncept Ambience

అభిమానుల అరుపులు, కేకల మధ్య రసవత్తరంగా జరిగిన పొలిటికల్ ఫోరం మీటింగ్

అభిమానుల అరుపులు, కేకల మధ్య రసవత్తరంగా జరిగిన పొలిటికల్ ఫోరం మీటింగ్

అమెరికాలో ఉన్న తెలుగు యువతికి, హైదరాబాద్‌లో ఉన్న తెలుగు యువత కంటే ఎక్కువగా తమ తమ జిల్లాల, గ్రామాలతో అను బంధం ఎక్కువని, అలాగే అనేక రాజకీయ నాయకు లతో పార్టీలతో కూడా అనుబంధం ఎక్కువ అని అందరూ అంటూ ఉంటారు. ఆ రాజకీయ అభిమా నులు చిన్న పెద్ద రాజకీయ నాయకులు అమెరికా వచ్చినప్పుడు వారిని కలిసి వారితో సమావేశం పెట్టి అందరూ కలిసి మాట్లాడాతారు అన్ని విషయం కూడా అందరికీ తెలిసిందే. అలాగే తెలుగు సంఘాలు తమ మహాసభల సమయంలోనూ, ఇతర సమయాల్లోనూ, అమెరికాకు వచ్చిన రాజకీయ నాయకులతో సమావేశాలను ఏర్పాటు చేస్తుంటాయి. ఇందుకోసం పొలిటికల్‌ ఫోరం ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి ఈ సమావేశాలను నిర్వహిస్తుంటుంది.

ఈ ఆటా కాన్ఫరెన్స్‌కు ప్రైమ్‌టైమ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. అలాగే పొలిటికల్‌ ఫోరం ఆధ్వర్యంలో ఆటాకు వచ్చిన రాజకీయ నాయకులతో ఓ సమావేశాన్ని అందరూ పాల్గొనేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీవీ9 రజనీకాంత్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన 5 పార్టీల నాయకులతో, అన్ని పార్టీల అభిమానులతో జరిగిన ఈ సభ అభిమానుల కేకలు, అరుపులతో సాగింది. సమావేశం రసవత్త రంగా జరిగిందని కొందరు, రసాభాసగా జరిగిందని మరి కొందరు చెప్పినా  ఆసక్తికరంగా జరిగిందనేది మాత్రం వాస్తవం. సమావేశంలో ఆటా అధ్యక్షుడు  భువనేష్‌ బుజాల మాట్లాడుతూ, ఆటా సంస్థకి  రెండు రాష్ట్రాలు, అన్ని పార్టీలు సమానమే అని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు క్లుప్తంగా మాట్లాడి సభను ప్రారంభించారు. అయితే  టీఆర్‌ఎస్‌ తరపున రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి మాట్లాడడం, వెంటనే తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులు శ్రీమతి భవాని రెడ్డి ఆవేశంగా మాట్లాడడంతో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ అభిమానులు కూడా ఆవేశ పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు రత్నకర్‌ పండుగా యాల, తెలుగుదేశం నాయకుడు సుబ్బారావు, బీజేపీ నాయకులు పాకూరి నాగభూషణం మాట్లాడినపుడు కూడా అభిమానులు రాష్ట్ర రాజధాని గురించి  ప్రశ్నలు వేయడం వాటి మీద మరిన్ని ప్రశ్నలు రావడం జరిగింది. మొత్తం మీద సమావేశం హాట్‌ హాట్‌గా.. ఆసక్తిగా సాగిందని మాత్రం చెప్పవచ్చు.

 

Tags :