తానా మహాసభల్లో రాజకీయ నాయకుల సందడి
ప్రతి తానా మహాసభల్లో ఎక్కువగా కనిపించే రాజకీయ నాయకులు ఈసారి కూడా భారీ సంఖ్యలోనే మహాసభలకు హాజరయ్యారు. తానా మహాసభల్లో సినీనటుల తరువాత రాజకీయ ప్రసంగాలే సాధారణంగా ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఈ మహాసభలకు పలు పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు వేడుకల్లో పెద్దఎత్తున పాల్గొన్నారు. పువ్వాడ అజయ్‌కుమార్, మల్లు భట్టి విక్రమార్క, కామినేని శ్రీనివాస్, నక్కా ఆనందబాబు, గంటా శ్రీనివాస్, పయ్యావుల కేశవ్, రసమయి బాలకిషన్, వసంత కష్ణ ప్రసాద్, విష్ణువర్ధన్‌రెడ్డి, సీ.ఎం.రమేష్, మన్నవ సుబ్బారావు, పాతూరి నాగభూషణం, తదితరులు ఈ మహాసభలకు వచ్చారు. అందరినీ తానా నాయకులు వేదికపైకి ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావానికి చిహ్నంగా అందరూ కలిసి నిర్వహిస్తున్న ఈ మహాసభలు విజయవంతం కావాలని వారు ఆకాంక్షిస్తూ, మహాసభలను ఘనంగా నిర్వహిస్తున్న కాన్ఫరెన్స్ నాయకులకు అభినందనలు తెలిపారు.