ASBL Koncept Ambience

చీర‌క‌ట్టులో ఫిదా చేస్తున్న ప్ర‌గ్యా

చీర‌క‌ట్టులో ఫిదా చేస్తున్న ప్ర‌గ్యా

కంచె సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌రైన ప్ర‌గ్యా జైశ్వాల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నంద‌మూరి బాల‌కృష్ణ లాంటి న‌టుల‌తో క‌లిసి న‌టించిన‌ప్ప‌టికీ అమ్మ‌డికి స్టార్‌డ‌మ్ మాత్రం రాలేదు. అయినా గివ‌ప్ ఇవ్వ‌కుండా ఇప్ప‌టికీ అవ‌కాశాల కోసం ఎదురుచూస్తున్న ప్ర‌గ్యా సోష‌ల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను, వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంటుంది. తాజాగా ప్ర‌గ్యా హాఫ్ వైట్ శారీ, హాఫ్ షోల్డ‌ర్ వైట్ బ్లౌజ్ ను ధ‌రించి అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకుంటుంది. ఈ చీర‌లో ప్ర‌గ్యాని చూసిన వారంతా ఫిదా అవుతున్నారు.  
 

 

 

Tags :