ASBL Koncept Ambience

తెలంగాణ భవిష్యత్ ప్రజలు నిర్ణయిస్తారా..జ్యోతిష్యులా ? : మోదీ

తెలంగాణ భవిష్యత్ ప్రజలు నిర్ణయిస్తారా..జ్యోతిష్యులా ? : మోదీ

టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రవ్యాఖ్యలు చేశారు. నేరుగా సీఎం కేసీఆర్‌పైనే విమర్శలు ఎక్కు పెట్టారు. పాలమూరు బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో ఎందుకు ముందస్తుకు వెళ్లారో చెప్పాలని  ప్రశ్నించారు. కేబినెట్‌ ఏర్పాటు చేయడానికి 3 నెలలు పట్టిందన్నారు. తెలంగాణలో ప్రజలను గాలికి వదిలేశారని విమర్శించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు యథావిధిగా జరిగి ఉంటే, వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యేది కాదన్నారు. మేలో పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, టీఆర్‌ఎస్‌ తుడిచిపెట్టుకుపోతుందన్నదని కేసీఆర్‌కు ఎవరో జ్యోతిష్యుడు చెప్పాడట. మోదీ ఛరిష్మాని నువ్వు తట్టుకోలేవని కేసీఆర్‌కి చెప్పారట. అందుకే హడావుడిగా కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. జ్యోతిష్యుడు చెప్పినట్ల కేసీఆర్‌ పాలన ఉంది. తెలంగాణ భవిష్యత్‌ ప్రజలు నిర్ణయిస్తారా. జ్యోతిష్యులా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కేవలం తమ కుటుంబం కోసమే ఆలోచించే పార్టీలు దళితులు, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయలేరని  మోదీ వ్యాఖ్యానించారు. అలాంటి వారికి దేశం, భద్రత ఏమీ పట్టవన్నారు. వాళ్ల బాగు వాళ్లు చూసుకుంటారని విమర్శించారు.

 

Tags :