ASBL Koncept Ambience

భారత్ లో పర్యటించండి....కమలా హారిస్ కు మోదీ ఆహ్వానం

భారత్ లో పర్యటించండి....కమలా హారిస్ కు మోదీ ఆహ్వానం

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో శ్వేతసౌధంలో భేటీ అయినప్పుడు ఆమెను భారత్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించిన తరువాత మోదీ మాట్లాడుతూ.. ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ గెలవడం చారిత్రాత్మకమనీ, ప్రపంచానికి ఆమె ఒక స్ఫూర్తి అని ప్రశంసించారు. భారత్‌-అమెరికా.. రెండు దేశాలు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని, రెండూ ఒకేరకమైన విలువలు, భౌగోళికమైన రాజకీయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయని చెప్పారు.అధ్యక్షుడు బైడెన్‌, కమల నేతృత్వంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థానానికి చేరుకుంటాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో సహకరించినందుకు అమెరికాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.  కమలా హారిస్‌ మాట్లాడుతూ.. అమెరికాకు భారత్‌ ప్రత్యేక భాగస్వామి అన్నారు. కరోనా ప్రారంభంలో టీకాలకు భారత్‌ వనరుగా ఉందని చెప్పారు. టీకా ఎగుమతుల పునరుద్ధరణపై భారత్‌ చేసిన ప్రకటనను కమల స్వాగతించారు.     

 

Tags :