ASBL Koncept Ambience

రాగావధానం... మరో వినూత్న కార్యక్రమం

రాగావధానం... మరో వినూత్న కార్యక్రమం

న్యూజెర్సిలో నాట్స్‌ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే  అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో జరగనున్న ఈ వేడుకలకు వచ్చే వారికి పసందైన కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రాగావధానం పేరుతో ఓ వినూత్నకార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. 

గానవిద్యా ప్రవీణ, స్వర ఘనాపాఠి, స్వర శుభకర గరికిపాటి వెంకట ప్రభాకర్‌తో కచేరీని ఏర్పాటు చేశారు. కర్ణాటిక్‌ క్లాసికల్‌ మ్యాస్ట్రో, స్వరరాగావధానం కార్యక్రమం సంధానకర్తగా డా. మధు దౌలపల్లి వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు రాధ కాశీనాధుని, జయచిళ్ళ, సుధ దేవులపల్లి, రవి కామరసు, రేఖ బ్రహ్మ సముద్రం, అరుణ గరిమెళ్ళ, వేణు ఓరుగంటి పాల్గొంటున్నారు. 

 

 

Tags :