టీఆర్ఎస్ పాలనకు చరమ గీతం : రాహుల్ గాంధీ
గత నాలుగున్నరేళ్లలో ఒకే ఒక వ్యక్తి తనకు తోచిందే వేదంగా నిరంకుశ పాలనను కొనసాగించారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ఏ కలల కోసమైతే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ కలలను కల్లలు చేస్తూ నాలుగున్నరేళ్లుగా కేసీఆర్ పాలనను కొనసాగించారని దుయ్యబట్టారు. ఆ పాలనను అంతమొందించి మీ కలలను సాకారం చేసేందుకు ఈ ప్రజాకూటమి అండగా ఉంటుందనీ, మీ పక్షాన కొట్లాడుతుందని ఆయన భరోసా ఇచ్చారు. మేడ్చల్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత సోనియా గాంధీ ఇక్కడికి వచ్చి తనకు తెలంగాణ ప్రజల భవిష్యత్‌పై ఎలాంటి ఆకాంక్ష ఉందనేది మీకు సృష్టం చేశారు. మీ అందరికి తెలుసు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీరు కొట్లాడుతున్నపుడు, మీ ఆకాంక్షలు సఫలీకృతం కావాలని మీరు పోరాటు చేసినప్పుడు సోనియా గాందీ మీ పక్కనే మీతో పాటు నిలబడింది. మీ ఆందోళనలతో పాటు రాష్ట్ర ఏర్పాటులో ఆమె పాత్ర కూడా ఉన్నతమైనది. అమ్మ మాట్లాడిన తార్వాత నేను ఎక్కువగా మాట్లాడలేను. రెండు మూడు ముచ్చట్లు చెబుతాను.
నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలనకు చరమ గీతం పాడబోతున్నాంం. ఈ నిరంకుశ రాజ్యాన్ని అంతం చేయడానికి కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, సీపీఐ, తెజస పార్టీలు కూడా జత కట్టాయి. త్వరలో ఏర్డనున్న ప్రజాకూటమి ప్రభుత్వం ఏ ఒక్కరి కోసమో పనిచేయదు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా పనిచేస్తుంది. యువత, విద్యార్థులు, రైతులు అందరి సమస్యలు పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ బహిరంగ సభకు విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు, లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని రాహుల్ తన ప్రసంగాన్ని ముగించి అభివాదాలు చేశారు.