ASBL Koncept Ambience

కేరళ నుంచి రాహుల్ గాంధీ పోటీ

కేరళ నుంచి రాహుల్ గాంధీ పోటీ

కాంగ్రెస్‌  అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లోక్‌సభకు రెండో స్థానం నుంచి కూడా పోటీ చేయనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిని మెరుగుపరచుకోవాలన్న ఉద్దేశంతో కేరళలోని వయనాడ్‌ను ఎంచుకున్నారు. కుటుంబానికి కంచుకోటలాంటి ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీలో కూడా యథావిధిగా రంగంలో ఉండనున్నారు. వయనాడ్‌ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేయనున్న విషయాన్ని కేరళకు చెందిన సీనియర్‌ నేత, రక్షణ శాఖ మాజీ మంత్రి ఎ.కె.ఆంటోని ప్రకటించారు. రాష్ట్ర శాఖ చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

 

Tags :