ASBL Koncept Ambience

అంగరంగ వైభవంగా జరిగిన రాహుల్‌ కోమటి వివాహ వేడుకలు

అంగరంగ వైభవంగా జరిగిన రాహుల్‌ కోమటి వివాహ వేడుకలు

అమెరికాలో తెలుగు ప్రముఖులు, తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి-కల్పన దంపతుల కుమారుడు రాహుల్‌ కోమటి వివాహం బంధుమిత్రుల సమక్షంలో నవంబర్‌ 23వ తేదీన ఆదివారంనాడు అంగరంగవైభవంగా జరిగింది.

శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలోని 100సంవత్సరాల 5స్టార్‌ లగ్జరీ హోటల్‌గా పేరు పొందిన ద ఫెయిర్‌మాంట్‌ హోటలులో రాహుల్‌ కోమటి-ఇసబెల్లా వివాహ వేడుకలు కన్నుల పండువగా జరిగింది. ఈ వివాహ వేడుకలకు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, కెనడా దేశాల నుండి బంధువులు, స్నేహితులు, తానా నాయకులు హాజరయ్యారు. ఆదివారం ఉదయం 10గంటలకు బారాత్‌ కార్యక్రమంతో వివాహ వేడుక ప్రారంభమయింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా రాహుల్‌-ఇజాబెల్‌ల వివాహంను ప్రముఖ పురోహితులు మారేపల్లి నాగవెంకటశాస్త్రి జరిపించారు. బారాత్‌ వేడుకల్లో రాహుల్‌, సోదరి మేఘన, ఆమె భర్త మార్సెల్‌తోపాటు బంధువులు, మిత్రులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు మిల్‌పిటాస్‌లోని జయరాం కోమటి స్వగృహంలో రాహుల్‌ను పెళ్ళికొడుకు వేడుకను జరిపించారు. ఈ వేడుకల్లో కూడా ఎంతోమంది పాల్గొన్నారు.

Click here Rahul Komati Marriage Gallery

Click here for VIPs at Rahul Komati Marriage

Click here Rahul Komati Marriage Evening Party Gallery

 

Tags :