రాహుల్ కోమటి పెళ్ళి....శాన్‌ఫ్రాన్సిస్కోలో తెలుగువాళ్ళ సందడి
అమెరికాలో తెలుగు ప్రముఖులు, తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి-కల్పన దంపతుల కుమారుడు రాహుల్ కోమటి వివాహం నవంబర్ 23వ తేదీన ఆదివారంనాడు అంగరంగ వైభవంగా జరిగింది. అమెరికాలోనూ, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో జయరాం కోమటి పేరు తెలియనివారు చాలా తక్కువమందే అని చెప్పవచ్చు. తానా నాయకునిగా, ఎఫ్‌ఐఎ నాయకునిగా, స్వాగత్ రెస్టారెంట్ అధినేతగా ఆయన పేరు ఎందరికో తెలుసు. దానికితోడు ఆయన దేవాలయాల నిర్మాణాలకు, పేద పిల్లల చదువులకు, తెలుగు సంఘాలు నిర్వహించే కార్యక్రమాలకు, వివిధ సేవా సంస్థలకు ఆయన ఎన్నో విరాళాలను అందిస్తున్నారు. అందరి అభిమానాన్ని ఆయన అందుకున్నారు.
మొన్నటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ ప్రగతికోసం ఎంతో కృషి చేశారు. ఎంతోమంది ఎన్నారైలను రాష్ట్ర ప్రగతిలో ఆయన భాగస్వాములను చేశారు. ఇలా ఎన్నో కార్యక్రమాలతో ఎందరికో తెలిసి జయరామ్ కోమటి ఇంట పెళ్ళి అంటే సాధారణ విషయం కాదుకదా!. అందుకే అమెరికాలో జరిగినా ఇండియా నుంచి వందల సంఖ్యలోనే బంధుమిత్రులు వివాహానికి హాజరయ్యారు. ఇక అమెరికాలో చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 3వందల మందికిపైగా బంధుమిత్రులు వివాహానికి వచ్చారు. దీంతో ఈ వివాహం జరిగిన ఫెయిర్‌మాంట్ హోటల్ లోనూ, పరిసర ప్రాంతాల్లోనూ తెలుగువాళ్ళ సందడి పెద్దఎత్తున కనిపించింది. దీంతో పలువురు అమెరికన్‌లు ఈ వివాహ వేడుకను చూసి ఆశ్చర్యపోయారు. ఇంత భారీగా, ఇంతకోలాహాలంగా చూడముచ్చటగా జరిగిన వివాహం అమెరికన్‌లను కూడా ఆకట్టుకుంది.
Click here Rahul Komati Marriage Gallery
Click here for VIPs at Rahul Komati Marriage
Click here Rahul Komati Marriage Evening Party Gallery