రాహుల్ వివాహ వేడుకలో అరిటాకు భోజనాలు
అమెరికాలో తెలుగు ప్రముఖులు, తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి-కల్పన దంపతుల కుమారుడు రాహుల్ కోమటి వివాహం నవంబర్ 23వ తేదీన ఆదివారంనాడు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకల్లో అందరినీ ఆకర్షించిన అంశం మరొకటి ఉంది. సంప్రదాయరీతిలో వచ్చిన బంధుమిత్రులకు, అతిధులకు భోజనాలు వడ్డించడం. రాహుల్-ఇసబెల్లా వివాహ వేడుకల్లో పెళ్లి కూతురు బెల్లా సంప్రదాయ వస్త్రధారణతో వచ్చి అందరీ ప్రశంసలను అందుకుంది. వివాహ వేడుక తరువాత సంప్రదాయ బద్దంగా పట్టు పంచ, చొక్కాలు ధరించి, వచ్చిన అతిథులకు అరిటాకులు వేసి, పిండి వంటలతో భోజనాలు వడ్డించారు. జయరామ్ కోమటి ఆతిధ్యం బావుందని వచ్చినవారు ప్రశంసించడం విశేషం.
హాస్పిటాలిటీ రంగం లో ఉన్న జయరాం గారి ఆలోచన లను నిజం చేస్తూ బే ఏరియా సోదరులు 25 మంది చేసిన ఆతిధ్య సేవ హైలైట్‌గా నిలిచింది.
Click here for Aritaku Meals at Rahul's Wedding Ceremony
Click here for Satyanarayana Vratam Event Gallery