ASBL Koncept Ambience

తానా ఎన్నికలు... కార్యదర్శి పదవికి రాజా కసుకుర్తి పోటీ

తానా ఎన్నికలు... కార్యదర్శి పదవికి రాజా కసుకుర్తి పోటీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)కు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ కార్యదర్శి పదవికి రాజా కసుకుర్తి పోటీ చేస్తున్నారు. తానాలో అంచెలంచెలుగా పదవులను అందుకుంటున్న రాజా కసుకుర్తికి మంచి పేరు ఉంది. దానికితోడు కార్యక్రమాలను చేయడంలో యాక్టివ్‌గా కూడా ఉంటారన్న ఇమేజ్‌ ఉంది. 2017-19లో తానా బ్యాక్‌ ప్యాక్‌ కో చైర్‌గా వ్యవహరించినప్పుడు ఎంతోమంది పిల్లలకు స్కూల్‌ బ్యాగ్‌లను, సామాగ్రిని పంపిణీ చేశారు. స్కూళ్ళను గుర్తించడంలోనూ, పిల్లలకు సహాయపడటంలో ముందుండే రాజా కసుకుర్తి తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి శెభాష్‌ అనిపించుకున్నారు. 

తరువాత 2019-21లో న్యూజెర్సి ప్రాంతంలో తానా రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా పనిచేసినప్పుడు మరిన్ని సేవా కార్యక్రమాలను తానా తరపున నిర్వహించారు. న్యూజెర్సిలో తానా సేవలను విస్తరించడంతోపాటు, తానా సేవలను అందరికీ అందేలా చేశారు. 

2021 - 23లో తానా కమ్యూనిటీ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌ ఎన్నికై తానా కార్యక్రమాలను మరింతమందికి చేరువయ్యేలా చేశారు. 

అమెరికాలోని తెలుగు కమ్యూనిటీతో, తానా నాయకులతో ఎల్లప్పుడూ సత్సంబంధాలను కలిగి ఉన్న రాజా కసుకుర్తి, అదే సమయంలో జన్మభూమికి కూడా తనవంతు సహాయపడాలని అనుకునేవారు. జన్మభూమిలో ఉన్న తెలుగువారికోసం ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారు. ఎంతోమంది విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌లను ఇచ్చారు. ఆయన చేసిన కార్యక్రమాల వల్ల ఆయన సొంతూరితోపాటు చుట్టుప్రక్కల ఉన్నవారు కూడా రాజా కసుకుర్తి ద్వారా తానా సేవలను తెలుసుకున్నారు. 

తానా ద్వారా యువత కోసం వినూత్నంగా హైస్కూల్‌ విధ్యార్థులకు కోచింగ్‌, పిల్లలకు మేధస్సు పెంపుదలకు ఉపయోగపడేలా వేలాది మంది పిల్లలకు తానా వేసవి శిక్షణ శిబిరం ద్వారా మ్యాథ్స్‌, సైన్స్‌, ఆర్ట్స్‌, చెస్‌ వంటి కర్యక్రమాలతో పాటు సి. పి. ఆర్‌. శిక్షణా శిబిరాలు, మెగా హెల్త్‌ క్యాంపుల నిర్వహణ సుమారు 2000 మందికి శస్త్ర చికిత్సలు, ఇంకా ఎంతోమందికి వైద్యసేవలు, పాఠశాలలను అభివృద్ధి, రోడ్డు సదుపాయాలు, విద్యుత్‌ సదుపాయాలు, విద్యాసౌకార్యాలు మెరుగు, ఇంటర్‌, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు సహాయం అమెరికాలోనూ ఇండియాలోనూ వేలాది మంది పిల్లలకు స్కూల్‌ బ్యాగ్లు, పాఠశాల సామాగ్రి పంపిణీ, తానా 5కె రన్‌, సంక్రాంతి సంబరాలు, వాలీబాల్‌ పోటీలు, ఫుడ్‌ డొనేషన్‌, తానా చైతన్య స్రవంతిలో మహిళలకు కుట్టుమిషన్లు, ఇస్త్రీ పెట్టెలు, వ్యవసాయదారులకు రైతు రక్షణ కిట్లు, పవర్‌ స్ప్రేయర్ల పంపిణీ, పాడి పరిశ్రమకు వ్యవసాయ ఆధునిక యంత్రాలు, యోగా ధ్యాన శిబిరాలు, స్థానిక ఆహార కేంద్రాలకు విరాళాలు, అష్టావధానం, ఘంటసాల వర్ధంతి వంటి కార్యక్రమాల నిర్వహణ, 200 మంది పోచంపల్లి చేనేత కార్మికులకు ఆసు యంత్రాలు అందించడానికి విరాళాల సేకరణ, కోవిడ్‌ మహమ్మారి సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది పేద ప్రజలకు భోజనం, నిత్యావసర వస్తువుల పంపిణీ, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు ఫుడ్‌ ప్యాకెట్ల పంపిణీ, అనాధ ఆశ్రమాలు, పాఠశాలలోని పిల్లల కోసం దుప్పట్లు, నిరుపేద మహిళలకు చీరల పంపిణీ, పోలీసులకు ప్రజలకు హెల్మెట్ల విరాళం, చేనేత కుటుంబాలకు ఆర్ధిక చేయూత వంటివి చేశారు. 

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తానా కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నానని తనను గెలిపిస్తే మరింతగా తానా సేవలను విస్తరిస్తానని, తానాకు మంచి ఇమేజ్‌ను తెస్తానని అంటున్నారు.

 

 

Tags :