ASBL Koncept Ambience

కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ పదవికి పోటీ చేస్తున్న రాజా కసుకుర్తి

కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ పదవికి పోటీ చేస్తున్న రాజా కసుకుర్తి

వంద మందికి సహాయపడలేకపోయినా ఒక్కరికీ సహాయం చేయమన్న మదర్‌ థెరిస్సా స్ఫూర్తిగా, వంద కాదు కదా, కొన్ని వేల మందికి సహాయపడే అవకాశాన్ని నాకు మన తానా ఇచ్చింది. అటువంటి మహోన్నతమైన సంస్థలో మీకు సేవలందించాలన్న లక్ష్యంతో కమ్యూనిటీ సర్వీస్‌ కోఆర్డినేటర్‌ పదవికి పోటీ చేస్తున్నాను. మీరు నన్ను ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటున్నాను.

తానాలో ఎన్నో కార్యక్రమాలు విజయవంతం కావడానికి కృషి చేశాను. ఇంటర్‌, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు సహాయం అందించాను. తానా బ్యాక్‌ప్యాక్‌ కో చైర్‌గా అమెరికాలోనూ ఇండియాలోనూ వేలాది మంది పిల్లలకు స్కూల్‌ బ్యాగ్‌లు, పాఠశాల సామాగ్రి అందించాను. ఎపి జన్మభూమి కార్యక్రమంలో భాగంగా 50 డిజిటల్‌ తరగతి గదులకు వ్యక్తిగతంగానూ, ఎన్నారైల ద్వారాను విరాళాలు సేకరించాను. తానా 5కె రన్‌, సంక్రాంతి సంబరాలు, వాలీబాల్‌ పోటీలు, న్యూయార్క్‌ క్రూయిజ్‌ యాత్ర, ఫాదర్స్‌ డే, పేదలకు అన్నదానం, అనాధశరణాలయాలకు ఫుడ్‌ డొనేషన్‌ వంటి ఎన్నో కార్యక్రమాలు న్యూజెర్సీ న్యూయార్క్‌ రాష్ట్రాలలో నిర్వహించాను. తానా చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా గ్రామస్థుల జీవన వికాసంకోసం మహిళలకు కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు, వ్యవసాయదారులకు రైతు రక్షణ కిట్లు, పవర్‌స్ప్రేయర్‌లను పంపిణీ చేశాను. 

2019-2021లో న్యూజెర్సీ తానా ప్రాంతీయ సమన్వయకర్తగా అనేక సిపిఆర్‌ శిక్షణా శిబిరాలు, యోగా-ధ్యాన శిబిరాలు, స్థానిక ఫుడ్‌ప్యాంటీలకు విరాళాలు వంటి సామాజిక కార్యక్రమాలతో పాటు అష్టావధానం, ఘంటసాల వర్ధంతి వంటి సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించాను. న్యూయార్క్‌ క్రూయిజ్‌ ఈవెంట్‌ ద్వారా 200 మంది  పోచంపల్లి చేనేత కార్మికులకు అసు యంత్రాలు అందించడానికి 10000డాలర్లకు పైగా విరాళాలు సేకరించాను. వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించాను.

కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని వేలాది మంది పేదలకు భోజనం, నిత్యావసర వస్తువులను అందించాను. న్యూజెర్సీలోని ఫ్రంట్‌లైన్ ‌వర్కర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఫుడ్‌ప్యాకెట్లను అందించాను. అనాధ ఆశ్రమాలు, పాఠశాల హాస్టళ్ళలోని పిల్లలకు దుప్పట్లు, పరుపులు, మంచాలు అందించాను.

సంక్రాంతి సమయంలో ఆంధ్రప్రదేశ్‌ లో నిరుపేద మహిళలకు 500 చీరలు పంపిణీ చేశాను. సేఫ్టీ అవేర్నెస్‌ వీక్‌ లో భాగంగా పోలీసులకు ప్రజలకు 300 హెల్మెట్లు విరాళంగా ఇచ్చాను. ఎన్నో అవగాహన సదస్సులను వెబినార్‌ ద్వారా నిర్వహించాను. తానా బాలోత్సవం, పిల్లల వర్క్‌షాప్‌లు నిర్వహించాను. వీవర్స్‌ టు ఉమెన్‌ ప్రణాళికను అమలుచేసి 150 చేనేత కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చాను. హెల్త్‌ క్యాంపుల ద్వారా సుమారు వెయ్యి మందికి కళ్లద్దాలు, 350 మందికి శస్త్ర చికిత్సలు అందించాను.

మీరంతా ఇచ్చిన ప్రోత్సాహం, మద్దతు వల్లనే ఇన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగలిగాను. ఇక మీద కూడా మీ తోడ్పాటుతో మరిన్ని సేవా కార్యక్రమాలను చేయాలన్న లక్ష్యంతో కమ్యూనిటీ సర్వీస్‌ కోఆర్డినేటర్‌ పదవికి పోటీ చేస్తున్నాను. 

నా లక్ష్యాలు...

1. ఉత్తర అమెరికా అంతటా సిపిఆర్‌ ట్రైనింగ్‌ కార్యక్రమం...
2. బోన్‌ మారో డ్రైవ్‌...అటిజంపై అవగాహన, బ్లడ్‌ డ్రైవ్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించడం
3. తానా బ్యాక్‌ప్యాక్‌ పంపిణీ కార్యక్రమంలో యూత్‌ను పాల్గొనేలా చేయడం…
4. వివిధ బిజినెస్‌ సంస్థలతో మాట్లాడి తానా సభ్యులకు ప్రత్యేక డిస్కౌంట్‌ సదుపాయం కల్పించడం
5. ఉత్తర అమెరికాలోని మన చిన్నారులకు ఆన్‌లైన్‌ ద్వారా, నేరుగా సమ్మర్‌ క్యాంప్‌ల ఏర్పాటు
6. ఫీడ్‌ ద నీడీ కార్యక్రమం కింద పేదలకు అహారము, అనాథ పిల్లలకు డ్రస్సులు, బొమ్మల పంపిణీ
7. ఉత్తర అమెరికాలో ఉంటున్న తెలుగు విద్యార్థులకు మార్గదర్శకాలను తెలియజేయడం, సహాయపడటం
8. ఉత్తర అమెరికాలో చదువుకుంటున్న మన పిల్లలకు తానా స్కాలర్‌షిప్‌లను ఇవ్వడం
9. అమెరికాకు వచ్చిన తల్లితండ్రులకు, విధ్యార్ధులకు ప్రత్యేక వైద్య సదుపాయాల కల్పన
10. వివిధ విషయాలపై సదస్సులు, నిష్ణాతులతో ప్రసంగాలు
11. చిన్నారులు, పెద్దలకోసం యోగ, మెడిటేషన్‌ కార్యక్రమాలు
12. ఉత్తర అమెరికాలో ఉన్న మనవాళ్ళ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు సేవలు

 

Tags :