తానా కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ పదవికి రజనీకాంత్ కాకర్ల పోటీ
ప్రస్తుతం జరుగుతున్న తానా ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలోని కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ పదవికి రజనీకాంత్ కాకర్ల పోటీ చేస్తున్నారు. తానాతో మంచి అనుబంధం ఉన్న రజనీకాంత్ కాకర్ల బే ఏరియాలో కమ్యూనిటీకి ఎంతో సేవలందించారు. కమ్యూనిటీకి మరింతగా సేవలందించేందుకు వీలుగా కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ పదవికి తనను గెలిపించాలని రజనీకాంత్ కాకర్ల కోరుతున్నారు.
తానాలో ఆయన వివిధ విభాగాల్లో పదవులను చేపట్టారు. 2019 నుండి ఉత్తర కాలిఫోర్నియా తానా ప్రాంతీయ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. 2015లో తానా క్రీడల విభాగ ఉపాధ్యక్షుడిగా సంస్థలోకి ప్రవేశించిన ఆయన 2017-19 మధ్య అదే విభాగానికి అధ్యక్షుడిగా కొనసాగారు. ఎపి జన్మభూమి కో ఆర్డినేటర్‌గా కూడా పనిచేశారు.
ఏపీ జన్మభూమి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 2500కు పైగా డిజిటల్ తరగతుల ఏర్పాటులో తానాను భాగస్వామ్యం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రవాసులతో మమేకమై మాత భూమిలో సేవా కార్యక్రమాలకు నిధులను సేకరించారు. అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం, శ్మశాన వాటికల నిర్మాణం తదితర ప్రాజెక్టులకు సహకారమందించారు. దీంతోపాటు వివిధ సెమినార్‌ల నిర్వహణలో కూడా పాలుపంచుకున్నారు. మిల్పిటాస్, సీఏలలో ట్రస్ట్ ఎస్టేట్ ప్లానింగ్ సెషన్ నిర్వహించారు. బే ఏరియాలో వాలీబాల్, మహిళా త్రోబాల్ టోర్నమెంట్ల నిర్వహణలో కీలకపాత్ర పోషించడమే కాకుండా తానా ప్రాజెక్టులకు నిధులను కూడా సేకరించారు. హెచ్.ఏ స్నోఎలిమెంటరీ స్కూల్‌లో బ్యాక్ ప్యాక్ కార్యక్రమం కింద విద్యార్థులకు 500 స్కూల్ బ్యాగ్‌లు, స్టేషనరీలను పంపిణీ చేశారు.
తానా, ఏపీ జన్మభూమి సంయుక్తంగా నిర్వహించిన ఆహార పంపిణీ కార్యక్రమానికి 5 వేల డాలర్ల విలువైన ఆహారాన్ని అందించారు. 'తానా' ప్రాజెక్ట్స్ లో భాగంగా మన ఊరికోసం కార్యక్రమంలో భాగంగా బే ఏరియాలో నిర్వహించిన 5 కిలో మీటర్ల వాక్/రన్ కోసం నిధులు సేకరించారు. అనేక మంది కుటుంబాలకు వివిధ రూపాల్లో సాయం చేశారు. కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఫేస్ షీల్డ్స్‌ను పంపిణీ చేశారు. సీఏలోని కైసెర్ హెల్త్ కేర్ సెంటర్‌లో ఆరోగ్య కార్యకర్తలకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు. సత్తర్ హెల్త్ కేర్ సెంటర్‌లో ఆరోగ్య కార్యకర్తలకు అల్పాహారం పంపిణీ చేశారు. అనాధలకు మధ్యాహ్న భోజనం పంపిణీ, మిల్పిటాస్, సీఏఈలోని ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు. అదేవిధంగా పోలీస్, ఫైర్ డిపార్ట్‌మెంట్స్ ఉద్యోగులకు కూడా వీటిని అందించారు. ఆకలిగొన్న పేదలకు ఆహారం అందించేందుకు బాటా సంస్థతో కలిసి సెలవు రోజుల్లో పాల్గొన్నారు. దాదాపు 10 వేల డాలర్ల విలువైన ఆహారాన్ని పది నగరాల్లో అందించారు. ఇళ్లు లేని పేదలకు దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగ్స్‌ను బాటా సంస్థతో కలిసి పంపిణీ చేశారు. ఆదరణ కార్యక్రమం కింద దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేశారు. 'తానా' పత్రికకు విరాళాలు అందించారు.
20 బోన్ మారో డ్రైవ్‌లు నిర్వహించారు. 700 రిజిస్ట్రేషన్లు చేయించారు. గడిచిన ఐదేళ్లుగా బే ఏరియాలో 'తానా' టీంస్క్వేర్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 'తానా' కేన్సర్ శిబిరాలకు విరాళాలు ఇచ్చారు. రైతు కోసం ప్రాజెక్టుకు విరాళాలు అందించారు. నిరుపేదల కోసం నిర్వహించిన ఆహార పంపిణీ కోసం 5 వేల డాలర్లను సేకరించి ఇచ్చారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడంతోపాటు ఆ కార్యక్రమాలన్ని విజయవంతమయ్యేలా కృషి చేశారు. 'తానా' సదస్సుల కోసం నిధులు సేకరించారు. హైదరాబాద్‌లోని శంకర నేత్ర ఫౌండేషన్ కోసం నిదులు సేకరించారు.
స్పోర్ట్స్ టోర్నమెంట్‌లు...
2016, 2017, 2018 సంవత్సరంలో తానా క్రీడల కోఆర్డినేటర్‌గా వాలీబాల్, మహిళలకు త్రోబాల్ టోర్నమెంట్‌లను బే ఏరియాలో నిర్వహించారు. 2016, 2017, 2018, 2019: 'తానా' క్రికెట్ టోర్నమెంట్స్ లో స్థానిక బాటా సంస్థతో కలిసి చురుగ్గా పాల్గొన్నారు.
జన్మభూమి కో ఆర్డినేటర్‌గా...
జన్మభూమి కో ఆర్డినేటర్‌గా రజనీకాంత్ తనదైన సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 2500 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు 'తానా' ఆధ్వర్యంలో కృషి చేశారు. జన్మభూమి అభివృద్ధి కోసం అమెరికాలోని స్థానిక సంస్థలతో కలిసి నిధులు సేకరించారు. ఆంధ్రప్రదేశ్‌లో అంగన్ వాడీ కేంద్రాల ఏర్పాటుతోపాటు దహన వాటికల నిర్మాణానికి, ఆంధ్రప్రదేశ్‌లోని 2500 గ్రామాల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు కృషి చేశారు.
తానా ద్వారా కమ్యూనిటీకి మరింత సేవలందించేందుకు వీలుగా తనను కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ పదవికి ఎన్నుకోవాల్సిందిగా మరోసారి రజనీకాంత్ కాకర్ల అభ్యర్థిస్తున్నారు.