డ్రాగన్ బోట్ ఫెస్టివల్ బోట్ రేస్‌లో తానా
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరో ఘనతను సాధించింది. అప్పలచియాన్-రాలేలో జరిగిన డ్రాగన్ బోట్ ఫెస్టివల్ బోట్‌రేస్‌లో తానా టీమ్ పాల్గొంది. ఈ బోట్ రేస్‌లో పాల్గొన్న తొలి ఇండియన్ అసోసియేషన్‌గా తానా పేరు తెచ్చుకుంది. చైనీస్, అమెరికన్, ఇండియన్స్ ఈ రేస్‌లో పాలొన్నారు. దాదాపు 7000మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తానా తన బోట్‌కు తానా టీమ్ స్క్వేర్ అని పేరు పెట్టింది. (గతంలో ఇక్కడ జరిగిన విపత్తుల్లో ఆపదలోఉన్నవారిని తానా టీమ్ స్క్వేర్ వలంటీర్లు ఆదుకున్నారు) 3 రౌండ్స్‌లో జరిగిన రేసింగ్‌లో దాదాపు 40 మంది పాల్గొన్నారు. ఈ రేస్‌లో దాదాపు 22 టీమ్‌లు పాలుపంచుకున్నాయి. ఈ రేసింగ్‌లో పాలుపంచుకున్న తానా టీమ్‌ను పలువురు అభినందించారు.
Tags :