తానా మహాసభలకు రాంమాధవ్ రాక
వాషింగ్టన్ డీసీలోని వాల్టార్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న తానా 22వ మహాసభల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పాల్గొంటున్నారు. దీంతోపాటు 6వతేదీన జరిగే ఇండియా పొలిటికల్ ఫోరంలో కూడా ఆయన పాల్గొంటున్నారని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సభ్యులు డా. ఆడప ప్రసాద్ తెలిపారు. తానా మహాసభల ముగింపు కార్యక్రమంలో రాంమాధవ్ ప్రసంగించనున్నారని చెప్పారు. తానా అధ్యక్షులు సతీష్ వేమన, కన్వెన్షన్ కన్వీనర్ డా. వెంకట రావు ముల్పూరిలు రామ్ మాధవ్‌తోపాటూ, ముఖ్య అతిథులకు స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Tags :