ASBL Koncept Ambience

ఘనంగా ముగిసిన రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలు

ఘనంగా ముగిసిన రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలు

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో జరుగుతున్న రామానుజాచర్య సహస్రాబ్ది ఉత్సవాలు ముగిశాయి. చివరి  రోజు యాగశాలలోని సహస్ర కుండాల శ్రీ లక్ష్మీనారాయణ యజ్ఞానికి మహా పూర్ణాహుతి నిర్వహించారు.  వేలాది మంది రుత్వికులు, భక్తుల సమక్షంలో చినజీయర్‌స్వామి  శ్రీలక్ష్మీ నారాయణ మహా యాగాన్ని ముగించారు. యాగాల్లో వినియోగించిన 1,035 పాలికులతో యాత్రగా రామానుజ స్వర్ణ విగ్రహం వద్దకు చేరుకున్నారు. చినజీయర్‌స్వామి చేతుల మీదుగా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠాపన చేశారు. స్వర్ణ మూర్తి ప్రతిష్ఠాపన ముగియడంతో భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఉన్న రుత్వికులు, భక్తులు శ్రీమన్నారాయణ మంత్రాన్ని ఆలపిస్తూ ఆనంద తాండవం చేశారు.  శాంతి కల్యాణాన్ని ఈ నెల 19కి వాయిదా వేశారు. సహస్రాబ్ది ఉత్సవాల్లో చివరి రోజు రామానుజాచార్య విగ్రహం చుట్టూ నాలుగు పారాచూట్‌లతో పూల వర్షం కురిపించారు. దాదాపు గంటపాలు జరిగిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్సవాల ముగింపు రోజు సమతా మూర్తి దివ్య క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి దంపతులు, మైహోం గ్రూపు సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు, భక్తులు పాల్గొన్నారు.

Click here for Photogallery

Tags :