ASBL Koncept Ambience

రామానుజుడి దృక్పథమే ప్రపంచానికి ఏకైక దారి : మంత్రి ఎర్రబెల్లి

రామానుజుడి దృక్పథమే ప్రపంచానికి ఏకైక దారి : మంత్రి ఎర్రబెల్లి

అందరూ సమానం అనే విషయాన్ని చాటుతున్న రామానుజుడి దృక్పథమే ప్రపంచానికి ఏకైక దారి అని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. ముచ్చింత్‌లోని శ్రీరామనగరంను కుటుంబ సమేతంగా సందర్శించారు. రామానుజ స్వామి వారిని దర్శించుకున్న ఎర్రబెల్లి  మీడియాతో మాట్లాడుతూ సమాన అవకాశాలు, సమ భావనతోనే సమాజంలో సుఖశాంతులు విరాజిల్లుతాయని అన్నారు. 

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 100 ఏండ్ల క్రితమే ప్రపంచానికి సమతను చాటిన రామానుజుల స్వామి వారి భారీ విగ్రహాన్ని ముచ్చింతల్‌లో ప్రతిష్ఠించడం సంతోషంగా ఉందన్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి, మై హోమ్స్‌ అధినేత రామేశ్వర్‌ రావు చరిత్రలో నిలిచి పోతారని అన్నారు. సమతా మూర్తి విగ్రహ ప్రతిష్ఠ రాష్ట్రం పేరు ప్రఖ్యాతులను మరింత పెంచిందని, ప్రపంచ భక్తి పటంలో అంతర్జాతీయ సమతా క్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా ముచ్చింతల్‌ నిలిచిపోనున్నదని అన్నారు.

 

 

Tags :