తానా మహాసభలు...కమిటీల నియామకాలు రవిమందలపుకు కీలక పదవి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) జులై 7, 8, 9 తేదీలలో ఫిలడెల్ఫియా మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న 23వ మహాసభల కోసం ఏర్పాట్లను ముమ్మరం చేశారు. తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తానా కమిటీల ఏర్పాటుపై చర్చించి నిర్ణయించినట్లు తెలిసిందే. అధ్యక్షుడు అంజయ్య చౌదరి, తానా మహాసభల కన్వీనర్‌గా ఉన్న రవిపొట్లూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి తానా సభ్యులు, నాయకులు, ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తానా మహాసభలకు ఫండ్స్‌ను రైజ్ చేయడంలో కీలకపాత్ర పోషించిన రవి మందలపును 23వ మహాసభల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించినట్లు తెలిసింది. తానా ఫౌండేషన్ ట్రస్టీగా, తానా ఫౌండేషన్ కార్యదర్శిగా, వాషింగ్టన్ డీసీ మహాసభల ఫండ్ రైజింగ్ కమిటీ ఛైర్మన్ పదవులను రవి మందలపు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Tags :