కర్నూలు జిల్లా ఓర్వకల్లులో సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించిన రవి పొట్లూరి
కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ఉన్న బాలభారతి స్కూల్‌లో సైన్స్ ల్యాబ్‌ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కార్యదర్శి రవి పొట్లూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్‌కు అవసరమైన టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్‌ను కూడా ఆయన అందజేశారు. ఎన్నారైలు రామ్ చౌదరి ఉప్పుటూరి, వాసుబాబు గోరంట్ల ఈ మెటీరియల్‌ను విరాళంగా ఇచ్చారు. ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్య సంఘం (ఓమ్‌ప్లిస్) సొంత డబ్బులతో ఈ స్కూల్‌ను నిర్మించి నిర్వహిస్తోంది. దాదాపు 10,000మంది సభ్యులతో ఆసియాలోనే అతి పెద్ద పొదుపు సంఘంగా పేరు తెచ్చుకున్న ఈ సంఘంలో ఉన్న సభ్యుల్లో చాలామంది నిరక్షరాస్యులు. తమ పిల్లలు తమలాగా కాకూడదన్న ఉద్దేశ్యంతో కార్పొరేట్ స్కూల్‌కు తలదన్నేలా ఈ బాలభారతి స్కూల్‌ను నిర్మించారు. సభ్యులే కూలీలు, మేస్త్రీలుగామారి ఈ స్కూల్‌ను నిర్మించడం విశేషం. ఈ సంఘానికి కో ఆర్డినేటర్‌గా ఉన్న బి. విజయభారతి ఈ స్కూల్ నిర్వహణను చూస్తున్నారు. తానా ఆమె చేస్తున్న సేవను గుర్తించి వాషింగ్టన్‌డీసిలో జరిగిన 2019 కాన్ఫరెన్స్‌లో ఆమెను ప్రెసిడెంట్ అవార్డ్‌తో సత్కరించిన సంగతి తెలిసిందే.