ASBL Koncept Ambience

ఇవాంక బృందంలో కాటాపూర్‌ వాసి

ఇవాంక బృందంలో కాటాపూర్‌ వాసి

హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సమావేశానికి హాజరైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూతురు ఇవాంక ట్రంప్‌ బృందంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, కాటాపూర్‌ గ్రామానికి చెందిన పులి రవి అనే యువ పారిశ్రామికవేత్త పాల్గొన్నారు. మారుమూల పల్లెల్లో పుట్టిన రవి వ్యాపార రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. సమ్మక్క-సారలమ్మ తాడ్వాయి మండలంలోని కాటాపూరానికి చెందిన పులి రవి అమెరికా నుంచి వచ్చిన ట్రంప్‌ బృందంలో ఉన్నారు. 20 ఏళ్ల క్రితమే ఉద్యోగ అవకాశం కోసం అమెరికాకు వెళ్లిన రవి అక్కడ ఐదేళ్లు పనిచేసి స్వంతంగా సాప్ట్‌వేర్‌ సెల్యూషన్‌ కంపెనీని స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఓ మారుమూల పల్లెటూరుకు చెందిన రవి అమెరికాలో యువపారిశ్రామిక వేత్తలో ఒకరుగా ఉన్నారు. ఆ కంపెనీ అందిస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు ఆహ్వానించింది. త్వరలోనే తనవంతుగా కొన్ని పరిశ్రమలను ఏర్పాటు చేసి తెలంగాణ నిరుద్యోగ నిర్మూలన కోసం సహాయపడతానని రవి పేర్కొన్నారు. ప్రపంచ మార్పును కోరే కొత్త ఆలోచనలతో వచ్చే వ్యాపార వేత్తలకు ఈ సమావేశం మంచి వేదిక కానుందని రవి ట్విటర్ట్‌లో పోస్టు చేశారు.

 

Tags :