పేద విద్యార్థినికి రవి పొట్లూరి చేయూత
కర్నూలు జిల్లా కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికోసం తానా కార్యదర్శి రవి పొట్లూరి ఎంతో కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలనే అక్కడి మహిళల కోసం తానా తరపున 60 లక్షల రూపాయలతో స్త్రీశక్తి భవన్‌ను నిర్మించి ఇవ్వడంలో రవిపొట్లూరి కీలక పాత్ర వహించారు. దాంతోపాటు అక్కడి మహిళలు స్వయంశక్తితో ఎదగడానికి అవసరమైన సహకారాన్ని కూడా అందిస్తున్నారు. గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని షహీన్‌కు చదువు నిమిత్తం 45వేల రూపాయలను అందించారు. మొదటి సంవత్సరంలో కూడా ఆమె చదువుకోసం రవి పొట్లూరి 40వేల రూపాయలను అందించిన సంగతి తెలిసిందే. ఆమె ఉన్నత విద్యకు కూడా అవసరమైన సహాయం చేస్తానని రవి పొట్లూరి తెలిపారు. కప్పట్రాళ్ళ గ్రామం అన్నీ విధాలా అభివృద్ధి చెందాలన్నదే తన ధ్యేయమని ఆయన చెప్పారు.
Tags :