ASBL Koncept Ambience

సతీష్ మాట...అత్యధిక ధరకు అమ్ముడైన ఎన్టీఆర్ చిత్రం

సతీష్ మాట...అత్యధిక ధరకు అమ్ముడైన ఎన్టీఆర్ చిత్రం

సెయింట్‌లూయిస్‌ నగరంలో జరుగుతున్న తానా మహాసభల్లో మరో ప్రత్యేకతమైన అంశం జరిగింది. ప్రముఖ చిత్రకారుడు విలాస్‌ నాయక్‌ అతిధుల కోరిక మేరకు ఎన్టీఆర్‌ చిత్రపటాన్ని గీసి ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రాన్ని తానా ఫౌండేషన్‌ నిధు లకోసం తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమన వేలం వేశారు. సతీష్‌ మాటతో ఆయన మిత్రులు ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. వాషింగ్టన్‌ డీసిలో ఉంటున్న గుంటూరు జిల్లా వాసి ఉప్పుటూరి రాం చౌదరి, సెయింట్‌ లూయిస్‌కు చెందిన రజనీకాంత్‌ గంగవరపు పోటీపడి రేట్‌ పెంచుతూ పోయారు. చివరకు 55వేల డాలర్లకు రజనీకాంత్‌ దీనిని కైవసం చేసుకున్నాడు. ఎన్టీఆర్‌ పుట్టినరోజునాడు తానా ఆవిర్భావిదినోత్సవం నాడు తానా ఫౌండేషన్‌కు పెద్దమొత్తంలో నిధులు అందడంపై తానా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస గోగినేని, అధ్యక్షుడు డా. జంపాల చౌదరి, కన్వీనర్‌ చదలవాడ కూర్మనాథ్‌ సతీష్‌ వేమన తదితరులు విలాస్‌రావు గీసిన ఎన్టీఆర్‌ చిత్రాన్ని రజనీకాంత్‌కు అందజేశారు.

 

Tags :