మహానాడులో రేవంత్ హల్ చల్
తెలుగుదేశం పార్టీ జాతీయ మహానాడులో పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రత్యేకాకర్షణగా నిలిచారు. కేసీఆర్‌కు ఎదురొడ్డి పోరాడే నేతగా పేరొందారు. ఆసక్తికరమైన పిట్టకథలతో ప్రసంగించే రేవంత్ శైలి ఆంధ్రప్రదేశ్‌లోనూ అభిమానులను సంపాదించి పెట్టింది. తొలి రోజు మహానాడులో రేవంత్ వేదికపైకి రాగానే కార్యకర్తలు, నేతలు, ఈలలు, కేకలతో హర్షధ్వానాలు చేశారు. వేదికపై ఆయన పేరు ప్రస్తావించిన ప్రతి సారి చప్పట్లు మార్మోగడం ఏపీ నేతలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. రేవంత్‌తో సెల్ఫీలు తీసుకోవడానికి, ఫొటోలు దిగడానికి పోటీ పడ్డారు. నారా లోకేశ్ 15 నిమిషాలు రేవంత్‌తో ముచ్చటించారు.
Tags :