సమతామూర్తి విగ్రహం తయారీ ఎక్కడో తెలుసా?
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ (సమతామూర్తి విగ్రహం) తయారీ చైనాలో జరిగింది. చైనాకు చెందిన ఏరోసన్ కార్పొరేషన్ ఈ విగ్రహ తయారీ కాంట్రాక్టును దక్కించుకున్నది. ఇందుకు దాదాపు రూ.135 కోట్ల ఖర్చయ్యింది. 216 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే రెండో అతిపెద్దదైన విగ్రహం తయారీ కాంట్రాక్టును దక్కించుకోవడానికి ఒక భారతీయ కంపెనీ కూడా పోటీ పడిరది. చివరకు చైనాకు చెందిన ఏరోసన్ కంపెనీ విగ్రహ తయారీ ఆర్డర్‌ను 2015లో ఆగస్టులో ఇచ్చారు. ఈ మేరకు ఏరోసన్ కంపెనీతో కాంట్రాక్టు కుదిరింది. ఈ కాంట్రాక్టుపై మై హోం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావు శ్రీరామానుజ సహస్రాబ్ది ఆర్గనైజర్స్ తరపున సంతకం చేశారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న సమతా కేంద్రం 45 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. ఈ భూమిని జూపల్లి దానం చేశారు.
విగ్రహ తయారీలో భాగంగా కాస్టింగ్ పనులు చైనాలో జరిగాయి. మొత్తం 1600 ల భాగాలతో విగ్రహాన్ని ఇక్కడకు (భారత్‌కు) తీసుకొచ్చారు. విగ్రహ ఏర్పాటు ప్రక్రియ 2017`18లో మొదలైంది. ఇందుకు 15 నెలల సమయం పట్టింది.