ఆర్ వీ నిర్మాణ్ రెండు ప్రాజెక్టులు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కస్టమర్లను ఆకట్టుకున్న కంపెనీల్లో ఆర్‌వి నిర్మాణ్ కూడా ఉంది. ఈ కంపెనీ కస్టమర్లకోసం కొత్తగా రెండు ప్రాజెక్టులను ప్రారంభించింది. వీటికి తెలంగాణ రెరా అథారిటీ నుంచి అనుమతి కూడా తీసుకున్నది. ఆర్‌వీ సౌమిత్రా అనే విల్లా ప్రాజెక్టుకు కిస్మత్‌పురాలో శ్రీకారం చుట్టింది. సుమారు పదిన్నర ఎకరాల స్థలంలో.. 118 విల్లాలను నిర్మిస్తోంది. నాలుగు రకాల ఎలివేషన్లను ఈ ప్రాజెక్టులో పరిచయం చేస్తున్నామని సంస్థ ప్రకటించింది. మొదటి విడతలో భాగంగా విల్లాలకు సంబంధించిన శ్లాబు పనులు జరుగుతున్నాయి. కొన్ని ప్లింత్ బీమ్ లెవెల్‌లో ప్రస్తుతం ఉండగా.. మరికొన్ని విల్లాల్లో ఇటుక పనులూ ప్రారంభమయ్యాయి. ఇక, ఆర్‌వీ అక్షోభ్య అనే గేటెడ్ కమ్యూనిటీని బండ్లగూడలో మొదలెట్టింది. సుమారు 1.9 ఎకరాల్లో 143 ఫ్లాట్లను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి మరిన్ని వివరాలకోసం చూడండి. https://www.rvnirmaan.com/index.html