ASBL Koncept Ambience

గౌడవల్లిలో సాకేత్ రిటైర్మెంట్ హోమ్స్

గౌడవల్లిలో సాకేత్ రిటైర్మెంట్ హోమ్స్

హైదరాబాద్‌లో తొలి రిటైర్మెంట్‌ హోమ్స్‌ నిర్మించి ప్రత్యేకత సృష్టించుకున్న సాకేత్‌ గ్రూపు మరో కొత్త ప్రాజెక్టుతో ముందుకు వచ్చింది. కాప్రాలో 4.5 ఎకరాల్లో 333 రిటైర్మెంట్‌ హోమ్స్‌లను ప్రణామ్‌ పేరుతో నిర్మించిన సాకేత్‌ గ్రూప్‌ తాజాగా మరొక ప్రాజెక్ట్‌తో  ముందుకొచ్చింది. కొంపల్లి దగ్గర్లోని గౌడవల్లిలో 5.29 ఎకరాల్లో ప్రణామం పేరిట రిటైర్మెంట్‌ హోమ్స్‌లను నిర్మిస్తోంది. గౌడవల్లిలో భూసత్వ పేరిట 80 ఎకరాలను అభివద్ధి చేస్తోంది. ఇందులో మూడు దశల్లో  600 విల్లాలను నిర్మించనుంది. ఇప్పటికే ఫేజ్‌ 1లో 220 ప్రీమియం విల్లాలను నిర్మించింది. వీటిల్లో సుమారు వందకు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి కూడా. భూ సత్వ పక్కనే 5.29 ఎకరాల్లో ప్రణామం పేరిట రిటైర్మెంట్‌ హోమ్స్‌ ప్రాజెక్ట్‌ను కూడా సాకేత్‌ గ్రూపు చేపట్టింది. ఇందులో నాలుగు బ్లాక్స్‌లో కలిపి 481 గహాలుంటాయి. ప్రాజెక్ట్‌లో 30 శాతం బిల్టప్‌ ఏరియా, 70 శాతం ఓపెన్‌ స్పేస్‌ ఉంటుంది. ప్రణామం ప్రాజెక్ట్‌ ప్రక్కనే నివాసితులు సేద తీరేందుకు వీలుగా చిట్టడవిని అభివద్ధి చేస్తున్నాం. 100/16 ఫీట్ల ఎత్తున్న చెట్లను పెంచుతున్నాం. రెండేళ్లలో చెట్ల ఎదుగుదలతో ఈ ప్రాంతమంతా పచ్చని పర్యావరణంతో నిండిపోతుంది.

పెద్దలను దష్టిలో పెట్టుకొని వసతులను కూడా కల్పిస్తున్నారు. 25 వేల చ.అ.ల్లో వెల్‌నెస్‌ హబ్‌ను నిర్మిస్తున్నాం. ఎంట్రెన్స్‌, లిఫ్ట్‌, మెట్ల మార్గంలో విశ్రాంతి తీసుకునేందుకు గదులు, చెయిర్స్‌ వంటివి ఉంటాయి. 24 గంటలు సెక్యూరిటీ, మెడికల్‌ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. అత్యవసర సేవల కోసం బజర్స్‌, కారిడార్స్‌, బాత్‌రూమ్స్‌ల్లో గ్రాబ్‌ బార్స్‌, యాంటిస్కిడ్‌ ఫ్లోరింగ్‌, ఫిజియోథెరపీ, నర్సు, అంబులెన్స్‌, ఆక్యుపెంచర్‌ వంటివి ఉంటాయి.

వృద్ధులు ప్రాజెక్ట్‌లో తిరిగేందుకు వీలుగా బ్యాటరీ కారు ఉంటుంది. వాకింగ్‌, జాగింగ్‌ ట్రాక్స్‌, ఆంపి థియేటర్‌, పార్క్‌, జిమ్‌, స్విమ్మింగ్‌ పూల్‌, లైబ్రరీ, యోగా, మెడిటేషన్‌ హాల్‌, ఇండోర్‌ గేమ్స్‌, ఏసీ డైనింగ్‌, కాఫీ షాపు, ల్యాండ్రీ, హౌస్‌కీపింగ్‌, గెస్ట్‌ రూమ్స్‌, మల్టీపర్పస్‌ పార్టీ హాల్‌ వంటి వసతులుంటాయి. విశాలమైన పార్కింగ్‌ ఏర్పాటు ఇలా ఎన్నో వసతులతో ప్రణామం రూపుదిద్దుకుంటోంది. ఇతర వివరాలకు చూడండి.

https://www.saketgroup.com/pranamam/

 

Tags :