ASBL Koncept Ambience

నాట్స్‌ సంబరాల్లో ప్రత్యేకం...  సంగీత సాహిత్య సమలంకృతే

నాట్స్‌ సంబరాల్లో ప్రత్యేకం...  సంగీత సాహిత్య సమలంకృతే

న్యూజెర్సిలో నాట్స్‌ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే  అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ సంబరాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో సంగీత సాహిత్య సమలంకృతే పేరుతో విశ్వనాథ్‌, సిరివెన్నెల, వాణిజయరాం, ఎస్‌.పి బాలసుబ్రహ్మణ్యంకు నివాళులు అర్పిస్తున్నారు. వారికి సంబంధించిన కార్యక్రమాలను ఈ కార్యక్రమాల్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారికి సంబంధించిన నృత్య ప్రదర్శనలు, ప్రముఖుల ప్రసంగాలు, దృశ్య శ్రవణ రూపకాలు, నాటక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. 

 

 

Tags :