బర్మింగ్ హామ్ లో సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలు 18/01/2020, యునైటెడ్ కింగ్డమ్, బర్మింగ్హామ్ న్యూ బింగ్ల్య్ హాల్ లో దాదాపు వెయ్యి మంది ఆహుతుల సమక్షంలో ఘనంగా జరిగాయి. వేద ప్రవచనం, సాంప్రదాయక ముగ్గుల పోటీలు, భోగిపళ్లు, గాలిపటాల పోటీలు, బాలముకుందం తెలుగు పాఠశాల నుంచి చిన్నారుల ప్రదర్శనలు అలరించాయి. పిన్నలు పెద్దలు కలిసి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. డాక్టర్ దండమూడి రవి కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రైతు నేస్తం మరియు సైనిక సహాయనిధికి దాదాపు లక్ష రూపాయల విరాళం అందచేయనున్నారు. ఇంతేకాకుండా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భగా విశేష కార్యక్రమాలతో అలరించారు.
Tags :