ASBL Koncept Ambience

టాంపా బే తెలుగు సంక్రాంతి వేడుకలు

టాంపా బే తెలుగు సంక్రాంతి వేడుకలు

ఫ్లోరిడాలోని టాంపా బే తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను జనవరి 28వ తేదీన వైభవంగా జరిపారు. ఈ వేడుకలకు దాదాపు 1600 మంది హాజరవడం విశేషం. ఈ వేడుకలను పురస్కరించుకుని డ్యాన్స్‌ పోటీలు ఏర్పాటు చేశారు. భరతనాట్యం, కూచిపూడి, జానపద, కోయ, టాలీవుడ్‌ నృత్యాల పోటీల్లో ఎంతోమంది పాల్గొన్నారు. మైనర్స్‌, జూనియర్స్‌,  సీనియర్స్‌ ,అడల్ట్స్‌ అని నాలుగు విభాగాల్లో జరిగిన పోటీల్లో ఎంతోమంది  తమ నాట్య కౌశల్యాన్ని  ప్రదర్శించారు. వేదికను సంక్రాంతి వాతావరణానికి అనుగుణంగా తయారు చేశారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన చెరుకు గెడల వద్ద, చాలామంది నిల్చుని ఫోటోలు తీసుకోవడం విశేషం.  ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతో ఆనందింపజేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు జీటీవి యాంకర్‌ అనన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో టాంపా బే ఏరియా తెలుగు సంఘం ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

టిఎఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ శ్రీమతి నీరజ జాస్తి,  వైస్‌ ప్రెసిడెంట్‌ భాను ప్రకాష్‌ ధూళిపాల్ల, సెక్రటరీ శ్రీనివాస్‌ కొమ్మినేని, జాయింట్‌ సెక్రటరీ పహ్దాద్‌ మాడభూషి, ట్రెజరర్‌ గాంధి నిదడవోలుతోపాటు కల్చరల్‌ కమిటీ ప్రెసిడెంట్‌ శ్యామ్‌ తంగిరాల, పిఆర్‌ కమిటీ సభ్యులు తాళ్ళ చందు, నరేందర్‌ కొమ్మ, శివ తాళ్ళూరు, శ్రీనివాస్‌ నన్నపనేని, కిరణ్‌ కొమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

Tags :