తానా ఉత్తమ నవలగా 'కొండపొలం' ఎంపిక
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభల సందర్భంగా నిర్వహించిన నవలల పోటీలో ఉత్తమ నవలగా కడప జిల్లా బాలరాజుపల్లెకు చెందిన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన కొండపొలం ఎంపికైందని ఆ సంస్థ అధ్యక్షుడు సతీశ్ వేమన ప్రకటించారు. ముందుగా చెప్పినట్టుగానే విజేతకు రెండు లక్షల రూపాయల బహుమతిని అందించనున్నామన్నారు. ఈ పోటీకి మొత్తం 58 నవలలు వచ్చాయన్నారు. న్యాయనిర్ణేతలుగా ప్రముఖ రచయితలు అంపశయ్య నవీన్, కాత్యాయనీ విద్మ హ్యేవహరించి నాలుగు నవలలను ఎంపిక చేయగా వాటిలో ఒకటైన కొండపొలం నవల ఉత్తమమైనదిగా పోటీ నిర్వహకుడు జంపాల చౌదరి, రచయితలు తాడికొండ శివకుమారశర్మ, అనిల్ ఎస్.రాయల్ సంయుక్తంగా ఎంపిక చేశారు. కాగా జులై 4, 5, 6 తేదీల్లో వాషింగ్టన్‌లో తానా 22వ మహాసభలు జరగనున్నాయి.
Tags :