అస్టిన్ లో తానా అభిమానులు, నాయకులతో సతీష్ వేమన భేటీ
వాషింగ్టన్ డీసీలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్న తానా 22వ మహాసభలను విజయవంతం చేయాలని అధ్యక్షుడు సతీష్ వేమన అస్టిన్‌లోని తానా నాయకులను, అభిమానులను కోరారు. తానా మహాసభల ప్రచారంలో భాగంగా అస్టిన్ తానా ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తానా మహాసభల విజయవంతానికి అస్టిన్‌లోని తానా నాయకులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. తానా మహాసభల ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణ వంటి విషయాలను ఆయన అందరికీ తెలియజేశారు. అస్టిన్ నుంచి పెద్దసంఖ్యలో తానా మహాసభలకు అందరూ తరలిరావాలని ఆయన కోరారు. కాగా తానా మహాసభల నిర్వహణకోసం అస్టిన్ తానా విభాగం ఇప్పటికే నిధులను సేకరించి తానా నాయకత్వానికి అందించింది.
Tags :