ASBL Koncept Ambience

తానా మహాసభల్లో శ్రీవారి కల్యాణం : సతీష్ వేమన

తానా మహాసభల్లో శ్రీవారి కల్యాణం : సతీష్ వేమన

అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జూలై 4, 5, 6 తేదీల్లో 22వ తానా మహాసభలు నిర్వహించనున్నట్టు తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన తెలిపారు. గురువారం శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. మహాసభల ఆహ్వానపత్రికను స్వామి పాదాల వద్ద ఉంచి, శ్రీవారి ఆశీస్సులతో అమెరికా తిరిగి వెళుతున్నానని చెప్పారు. వైట్‌హౌస్‌కు అతి దగ్గరల్లో జరగనున్న తానా మహాసభలకు ట్రంప్‌, ఒబామా, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ నుంచి కేటీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి చంద్రబాబు నాయుడును ఆహ్వానించామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కలిసి సభలకు ఆహ్వానిస్తామని చెప్పారు. చివరిరోజున టీటీడీ వేదపండితుల ఆధ్వర్యంలో తొలిసారి శ్రీవారి కల్యాణం నిర్వహించి, 20 వేల మందికి పైగా భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

 

Tags :