తానా మహాసభల్లో మాస్ హీరో... సతీష్ వేమన
సెయింట్‌లూయిస్‌లో జరుగుతున్న తానా మహాసభల్లో అందరినీ ఆకర్షిస్తున్న వ్యక్తిగా సతీష్ వేమన నిలిచారు. ఆయన ఏ కార్యక్రమంలో పాలుపంచుకున్నా ఆ కార్యక్రమం విజయవంతానికి ఆయన చేస్తున్న కృషి అందరినీ ఆకర్షిస్తుంది. మహాసభల్లో చెప్పాల్సిన అవసరం లేదు. తానా బాంక్వెట్ కార్యక్రమంలో కూడా సతీష్ వేమన అందరినీ పలకరించడంతోపాటు హుషారును తెప్పించారు.
మరోవైపు ఆదివారంనాడు తానా అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్న సతీష్ వేమనకు అభినందనలను తెలుపుతూ సతీష్ వేమన ఫ్రెండ్స్ పేరుతో మహాసభల ప్రాంగణం వద్ద, సామాజిక మాధ్యమాల్లో ఫ్లెక్సీలు, ఫ్లయర్లతో ఎంతోమంది అభినందనలు, శుభాకాంక్షలను తెలుపుతున్నారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన సతీష్‌వేమన అమెరికాలోని వాషింగ్టన్ డీసిలో ఉన్నప్పటికీ మాతృరాష్ట్రం లోని ప్రజలతో నాటి నుంచి వేటి వరకు సన్నిహితంగానే ఉంటూ వస్తున్నారు. వేమన ఫౌండేషన్ పేరుతో జిల్లా వాసులకు, ఇతరులకు సహాయపడ్డారు. అమెరికాలోని తెలుగు యువతకు అన్నగా ఉంటూ వారికి సాయపడుతున్నారు. తెలుగు విద్యార్థులు కష్టాల్లో ఉంటే తనవంతుగా ముందుగా సాయపడేది సతీష్ వేమనే అని చెబుతారు. తానా నాయకునిగా ఆయన ఎన్నో కార్యక్రమాలను చేపట్టి విజయవంతం చేశారు. ఇప్పుడు తానా అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తున్న నేపథ్యంలో ఎంతోమంది అభిమానులు, అమెరికాలోని తెలుగు యువత, ఆంధ్ర, రాయలసీమలోని తెలుగు యువత ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు చెబుతున్నారు.