ASBL Koncept Ambience

తెలంగాణలో మరో యూనిట్ ను ప్రారంభించనున్న ష్నైడర్ ఎలెక్ట్రిక్

తెలంగాణలో మరో యూనిట్ ను ప్రారంభించనున్న ష్నైడర్ ఎలెక్ట్రిక్

తెలంగాణలో మరో తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ష్నైడర్ ఎలెక్ట్రిక్ ఈ రోజు ప్రకటించింది. మంత్రి కేటీఆర్ తో దావోస్ లో సమావేశమైన ష్నైడర్ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లుక్ రిమోంట్ ఈ మేరకు కంపెనీ తరఫున ప్రకటన చేశారు. ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలు కొనసాగుతున్న తమ యూనిట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఫ్యాక్టరీ గా అడ్వాన్స్డ్ లైట్ హౌస్ అవార్డు పొందిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలు సాఫీగా కొనసాగుతున్నాయని, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల స్నేహపూర్వక వాతావరణం పైన ఆయన ప్రశంసలు కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తమ నూతన తయారీ ప్లాంట్ నుంచి ఎనర్జీ మేనేజ్మెంట్ మరియు ఆటోమేషన్ ఉత్పత్తులను తయారు చేయబోతున్నట్లు తెలిపారు. 

 

Tags :