తెలుగు అసోసియేషన్ ఆఫ్ షాంఘై ఆధ్వరంలో బతుకమ్మ మరియు దీపావళి వేడుకలు
తెలంగాణ పూల పండుగ "బతుకమ్మ" మరియు దీపావళి వేడుకలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ షాంఘై మరియు షాంఘై దక్షిణ సంగమం షాంఘైలో నవంబర్ 4 న అట్టహాసంగా జరుపుకొన్నారు. మేము తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగ గురించి మరియు దాని ప్రాముఖ్యత గురించి వీడియో ప్రదర్శన చేశాము. తెలుగు రాష్ట్రాల స్త్రీలు మరియు దక్షిణ ప్రాంతాల నుండి మా స్నేహితులు కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మా స్నేహితులు సుజౌ & షౌషింగ్ నుండి తరలి వచ్చారు. చైనాలో మొదటిసారి బతుకమ్మ పండుగను ఈ సంవత్సరం ఘనంగా జరుపుకున్నామని తెలియజేయుటకు మేము చాలా సంతోషపడుచున్నాము. రాబోయే సంవత్సరాల్లో ఇంకా గొప్ప స్థాయి లో బతుకమ్మ ఉత్సవాలు జరుపుకొంటామని ఆశాజనకంగా వున్నాము.
మా టీఆర్ఎస్ చైనా సంఘము నుండి ప్రతిఒక్కరికీ ఉత్సవాలను గొప్పరీతిలో విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు.
జి.వి రవీందర్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, మధు సూదన్ వర్మ, కృపాల్ రెడ్డి గోలీ, అవినాష్ గౌడ్, కృపాకర్ రెడ్డి, జై కృష్ణ తూము, సుష్మారెడ్డి, ముజాహిద్, అశోక్ కుమార్ గుప్తా, శేకర్ జ్యోత్సుల...
ప్రశాంతి, రమేష్ రెడ్డి, భాస్కర్, తేజా, ఆనంద్ కుమార్ రెడ్డి మరియు మిత్రులందరికీ పేరు పేరునా ఉత్సవాలను విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతాభినందనలు.
బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న అందరు మహిళలకు కూడా చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. బీజింగ్ లో మా సోదరులు మరియు సోదరీమణులు అక్టోబరు 20 న బతుకమ్మను దసరా పండుగ తో పాటు ఘనంగా జరుపుకున్నారు.