యాదాద్రిలో కన్నుల పండువగా శోభయాత్ర
యాదాద్రిలో ఆధ్మాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలయ్యాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వహించిన శోభయాత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. శోభాయాత్రలో భాగంగా బంగారు కవమూర్తులు, ఉత్సవ విగ్రహాలు, ఆళ్వార్లు ప్రదర్శించడంతో పాటు కళా ప్రదర్శనలు చేపట్టారు. వేద మంత్రోచ్ఛరణాలు, మేళతాళాల మధ్య శోభయాత్ర వైభవంగా కొనసాగింది. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రధానాలయ పంచతల రాజగోపురం వద్ద కేసీఆర్ స్వయంగా పల్లకిని మోశారు.
Tags :