ASBL Koncept Ambience

ఎస్ఎంఆర్ నుంచి వినయ్ ఐకానియా

ఎస్ఎంఆర్ నుంచి వినయ్ ఐకానియా

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో ఒకటైన ఎస్‌ఎంఆర్‌ నుంచి వస్తున్న వినయ్‌ ఐకానియా ప్రాజెక్టు ఎంతోమందిని ఆకర్షిస్తోంది. పశ్చిమ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి చేరువలో గల కొండాపూర్‌లో దాదాపు 22 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది. 35 అంతస్తుల ఆకాశహర్యాల్ని ఇందులో నిర్మిస్తున్నారు. ప్రత్యేకంగా హెలిప్యాడ్‌ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పశ్చిమ హైదరాబాద్‌కే ప్రధాన ఆకర్షణగా ఎస్‌ఎంఆర్‌ ఐకానియా నిలుస్తోందని చెబుతున్నారు.

గచ్చిబౌలి స్టేడియం నుంచి కాస్త ముందుకెళ్లి.. కుడివైపు తిరిగితే చాలు.. ఈ ప్రాజెక్టుకు చేరుకోవచ్చు. ఇందులో మొత్తం టవర్ల సంఖ్య.. దాదాపు పదకొండు. 2, 3, 4 పడక గదుల ఫ్లాట్లను ఇందులో ఎక్కువగా నిర్మిస్తున్నారు. వచ్చే మొత్తం ఫ్లాట్ల సంఖ్య.. 2,345. ఫ్లాట్ల విస్తీర్ణం 1400 నుంచి 2,925 చదరపు అడుగుల విస్తీర్ణంలో లభిస్తాయి. నిర్మాణం వచ్చేది కేవలం ఇరవై ఐదు శాతం స్థలంలోనే. మిగతా 75 శాతాన్ని ఖాళీగా కేటాయించారు. ఇందులో ఆధునిక సదుపాయాల్ని అభివద్ధి చేయడంపై ఎస్‌ఎంఆర్‌ ప్రత్యేక దష్టి సారిస్తున్నది. ఆధునిక రీతిలో క్లబ్‌హౌజ్‌ను అభివద్ధి చేస్తున్నది. పార్కులు, ప్లే ఏరియాలు, వాకింగ్‌ ట్రాక్‌, గెస్ట్‌ పార్కింగ్‌, బైసైకిల్‌ స్టాండ్‌, బాస్కెట్‌బాల్‌ కోర్టులు, క్రికెట్‌ నెట్‌, ఔట్‌డోర్‌ జిమ్‌, గెస్ట్‌ లాబీ సెంటర్‌ వంటివి ఇందులో ఉన్నాయి. క్లబ్‌హౌజ్‌లో ఇండోర్‌ షటిల్‌ కోర్టులు, స్కాష్‌ కోర్టులు, టెర్రస్‌ స్విమ్మింగ్‌పూల్‌, జిమ్‌, బ్యాంకెట్‌ హాళ్లు, గెస్టు రూములు, టెన్నిస్‌ కోర్టులు వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. షాపింగ్‌ సెంటర్‌ పూర్తి చేయడానికి ఎస్‌ఎంఆర్‌ సన్నాహాలు చేస్తున్నది.

 ఫేజు-2లో సుమారు 559 ఫ్లాట్లను సంస్థ నిర్మిస్తున్నది. ఈ ప్రాజెక్టు ఇతర వివరాలకోసం వెబ్‌సైట్‌ను చూడంది.

https://smrholdings.in/residential-projects/smr-vinay-iconia/

 

Tags :