ASBL Koncept Ambience

విదేశాంధ్రుల సేవలు అమోఘం - సోమిరెడ్డి

విదేశాంధ్రుల సేవలు అమోఘం - సోమిరెడ్డి

అమెరికా అభ్యున్నతికి విదేశాంధ్రులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. ఇర్వింగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆటా, టాటా కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న అమెరికన్‌ తెలుగు కన్వెన్షన్‌లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి ఇప్పుడు వేగంగా జరుగుతోందని చెప్పారు. విదేశాంధ్రుల చిన్నారుల ప్రదర్శనలు అబ్బురపరుస్తోందని, వారి ప్రతిభను ప్రోత్సహిస్తున్న తల్లితండ్రులకు తన కృతఙతలను ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా కన్వెన్షన్‌ను పురస్కరించుకుని ప్రచురించిన ప్రత్యేక సంచికను సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విడుదల చేశారు. ఈ ప్రత్యేక సంచిక సంపాదకులు వంగూరి చిట్టెన్‌రాజు మాట్లాడుతూ, సభల అలంకరణలు, ఆహార్యాలు, ఆనందాలు రెండు మూడ్రోజులకే మాయమైపోతాయని, సభలకోసం ప్రత్యేకంగా ప్రచురించిన సంచిక మాత్రం చిరస్మరణీయంగా నిలిచిపోతుందని చెప్పారు.

 

Tags :