అమరావతి అతిథులకు పసందైన విందు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు విచ్చేస్తున్న ప్రముఖులకు ఆంధ్రాస్పెషల్ వంటకాలు అందించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 2వేల మంది పాకశాస్త్ర నిష్టాతులను ప్రభుత్వం రప్పిస్తోంది. తెలుగువారికి ప్రత్యేకమైన వంటకాలతో పసందైన విందు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. విందులో అరిసెలు, గారెలు, పూర్ణాలు, గోంగూర వంటి ఆంధ్రా వంటకాలు తయారు చేస్తున్నారు. అలాగే సంద్రాయ పిండివంటలైన బొబ్బట్లు, పూర్ణం, బూరెలు, పూతరేకులు, నెల్లూరు గారెలతో పులిహోర, చక్రపొంగలి, దద్దోజనం, కొత్త అవకాయ, డ్రైపూట్స్, ప్రూట్ సలాడ్, మూడు రకాల ఐస్‌క్రిమ్‌లు అందించనున్నారు. తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి రూ. 25 లక్షల విలువైన 23 టన్నుల స్వీట్లు రాజధాని తరలిస్తున్నారు.
Tags :